17-05-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, మే 17: మిషన్ భగీరథ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చివుంటే ఈ పాటికి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైబ్ భూతం అదుపులోకి వచ్చేది. కానీ బిఆర్‌ఎస్ పథకం ఆచరణ కన్నా ఆర్భాటపు ప్రచారానికి ప్రాధనాª`యం ఇచ్చింది. మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్‌ను తరిమికొట్టామని అబద్దాలు అతిగా ప్రచారం చేశారు. నిజానికి శుద్ద జలం పంపిణీ జరిగితే తప్ప ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణ జరిగేలా కనిపించడం లేదు. ఇంటింటికి నీరు వస్తేనే ఇది దూరం అవుతుంది. భూగర్భ జలాల వినియోగం తగ్గితేనే ఇది సాధ్యం కాగలదు. శాశ్వత కరువు, ఫ్లోరోసిస్ నివారణకు కృష్ణా జలాలు అందించాలన్న పథకం ముందుకు సాగక పోవడంతో ఫ్లోరైడ్ గ్రామాలకు శాప విమోచనం కలగలేదు. జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్‌తో పోరాడుతున్నారు.
ఫలితంగా నక్కలగండి ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు అందించనున్నట్టు గత ప్రభుత్వం ప్రకటించి, ముప్ఫై లక్షలు కేటాయించింది. కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేయకపోవడంతో ప్రజలకు మంచినీటి లక్ష్యం నెరవేరలేదు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పథకాన్ని చేపట్టి గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల నీరు నల్గొండ జిల్లాలో అదనంగా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 700 గ్రామాలకు తాగునీరు అందించాలని జిల్లా ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో గతంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శ్రీశైలం కుడి, ఎడమ కాల్వలకు శంకుస్థాపన చేశారు. అయితే కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు మాత్రం నత్తనడకన సాగాయి. ఎస్‌ఎల్‌బీసీని పెండిరగ్‌లో పెట్టి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం జరిగింది.
శ్రీశైలం సొరంగం పథకాన్ని చేపట్టాలన్న జిల్లా ప్రజల ఆందోళనతో అనుమతిచ్చారు. అందులో రెండు టన్నల్స్‌కు 1950 కోట్లతో ఇపిసితో టెండర్ పిలిచి జేపీ అసోసియేషన్స్ వారితో ఒప్పందం జరిగింది. దీన్ని నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా, ప్రభుత్వం నిధులు కేటాయించనందున పూర్తికాలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యాభై ఏళ్లు గడిచినా ఈ ప్రాజెక్టు పూర్తికాదు. కాబట్టి తక్షణమే పూర్తిచేసి అందులో అంతర్భాగమైన నక్కలగండి (లోయర్‌డిరడి) రిజర్వాయర్ పనులను వెంటనే ప్రారంభించాలి.ఈ పథకంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ద్వారావచ్చే నాలుగువేల క్యూసెక్కులలో మూడువేల క్యూసెక్కులను దిగువ డిరడి (నక్కలగండి) జలాశయం నుంచి రెండు స్టేజీలలో ఎగువ డిరడికి 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 3.4 లక్షల ఎకరాలకు సాగునీరందించే సౌకర్యం ఉన్నది. శ్రీశైలం సొరంగ మార్గం ద్వారా వచ్చే నీటిని నక్కలగండి (చందంపేట మండలం) వద్ద 7.
టీఎంసీల సామర్థ్యంతో లోయర్ డిరడి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఎడమ కాలువ ద్వారా ఏఎమ్మార్పీకి సరఫరా చేస్తారు. గోనబోయినపల్లి సవిూపంలోని మేళ్లచెరువును మిడ్ డిరడి రిజర్వాయర్‌గా 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. మిడ్ డిరడి నుంచి 12.75 కిలోవిూటర్ల సొరంగం ద్వారా పంప్‌హౌస్‌కు నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి 560 విూటర్ల పొడవు, మూడువిూటర్ల వ్యాసార్థం కలిగిన ఆరు పైపుల ద్వారా 134 విూటర్ల ఎత్తు నుంచి అప్పర్ డిరడికి సరఫరా చేస్తారు. ప్రస్తుత డిరడి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7.2 టీఎంసీలకు పెంచుతారు. మధ్య డిరడి రిజర్వాయర్ నుంచి .7 కిలోవిూటర్ల పొడవు కాల్వలు తవ్వుతారు. ఈ కాలువకు మధ్యలో కాసారం, దేవరకొండ, సామలపల్లి గ్రామాల వద్ద 7 టీఎంసీల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఇవేగాక మైనంపల్లి, ఉప్పువాగు, నాంపల్లి, ఇర్విన్ వద్ద కూడా రిజర్వాయర్లు ఏర్పాటు`చేస్తారు.
మిడ్ డిరడి ద్వారా డిరడి, దేవరకొండ, చందంపేట, గుర్రంపోడ్, ఉప్పువాగు, నాంపల్లి, మునుగోడు, చండూరు, కనగల్లు, నల్గొండ మండలాలలో సుమా రు 90,500 ఎకరాలు, అచ్చంపేట మండలంలో 1000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నల్గొండ జిల్లాలో పశ్చిమ భాగంగా ఉన్న దేవరకొండ, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లో 14 కరువు పీడిత మండలాలలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఐదు మండలాల్లో సాగు, తాగునీరు అందించే ఈ పథకానికి ప్రణాళిక చేశారు. దీనిపై ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డి శ్రద్ద పెట్టాల్సి ఉంది.