17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: రాజకీయాల్లో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న విజయశాంతి హఠాత్తుగా బీఆర్‌ఎస్‌కు మద్దతుగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండిరచారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్టాల్ర సహజ విధానమననారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం అని చెప్పుకొచ్చారు. నిజానికి ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఉండదని బీజేపీ నేతలే కాదు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుందని.. బీజేపీ నేతలే అర్థం చేసుకోలేదన్నట్లుగా సోషల్ విూడియాలో స్పందించారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెను పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె పేరు పరిగణనలోకి తీసకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలువలేదు. కాంగ్రెస్ తీరుపై ఆమె అసంతృప్తిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి సొంత పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తర్వాత తన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున ఎంపీగా గెలిచారు.
పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో పోరాడారు. తెలంగాణ ఇస్తే.. టీఆర్‌ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత అలా చేయలేదని విజయశాంతి బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ.. కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరినా ఎన్నికల వరకూ ఉండలేదు. బీఆర్‌ఎస్ ను ఓడిరచే పార్టీ కాంగ్రెస్సేనని అనుకుని మళ్లీ ఆ పార్టీలో చేరారు. ఇన్ని పార్టీలు మారడం వల్ల ఆమెకు రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. తాజాగా బీఆర్‌ఎస్ కు మద్దతుగా మాట్లాడుతూండటం ఆసక్తికరంగా మారింది.