17-05-2024 RJ
తెలంగాణ
వరంగల్, మే 17: వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం లైంగిక దాడులకు గురైన బాధితులను అక్కున చేర్చుకోని వారికి అండగా నిలుస్తోందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన లైంగిక దాడుల కేసుల్లో బాధితులు వైద్య, వసతి, ఆర్థిక, న్యాయపరంగా సహకారం అందిస్తున్న భరోసా కేంద్రంలో ఈ కేసుల్లోని నిందితులకు శిక్షలు పడేవిధంగా భరోసా కేంద్రం అధికారులు, సిబ్బంది పనితీరును అభినందిస్తూ తెలంగాణ మహిళా భద్రత విభాగం అడిషినల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షీకాగోయెల్ ప్రశంస పత్రాలను జారీచేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల విూదుగా భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందికి దీనిని అందజేసారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు.
లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడటంలో భరోసా కేంద్రం సిబ్బంది పనితీరు అభినందనీయమని, ఈ కేంద్రం సిబ్బంది ఇప్పటి వరకు 24కేసుల్లో బాధితులకు బాసటగా నిలవడంతో పాటు నిందితులకు కోర్టు శిక్షలు విధించడంలో కీలకంగా నిలిచారు. అలాగే 335 బాధితులకు మొత్తం కలిపి ఒక కోటి ఇరువై లక్షల రూపాయలను పరిహారం క్రింద అందజేయడంతో పాటు మరో ఎనిమిది మందికి మొత్తం 14 లక్షల16 వేల రూపాయలను పరిహారాన్ని జిల్లా లీగల్ సర్వీస్ అథారీటి అందజేసారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రశంస పత్రాలు అందుకున్న వారిలో భరోసా కేంద్రం ఇన్స్‌స్పెక్టర్ సువర్ణ, ఎస్.ఐ శ్రావణి, ఇతర సిబ్బంది నీరజ, నవ్య, సాగరిక, సుమలత, రజిత, పవిత్ర, మౌనిక వున్నారు.