17-05-2024 RJ
సినీ స్క్రీన్
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తుంటారు. ప్రస్తుతం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. కేన్స్ ఫిలం ఫిస్టివల్‌లో మన తారలు తళుక్కుమన్నారు. ఇద్దరు తారలు తమ అందాల ఆరబోతతో ఆకట్టుకున్నారు. ఇందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తళుక్కుమన్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ బ్యూటీ క్యాట్‌వాక్ చేసింది. మెగాలోపోలిస్ ఫిల్మ్ కోసం ఆమె రెడ్‌కార్పెట్‌పై జిగేల్మన్నది. ఫాల్గుణి అండ్ షేన్ పీకాక్ డిజైనర్లు రూపొందించిన బ్లాక్ గౌన్‌లో ఐశ్వర్య దర్శనమిచ్చింది. గత రెండు దశాబ్దాల నుంచి కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య.. ఫిల్మ్ లవర్స్‌ను థ్రిల్ చేస్తూనే ఉన్నది.
త్రీడీ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్న మోనోక్రోమ్ గౌన్‌లో ఐశ్వర్య కనిపించారు. అయితే ఐశ్వర్య కుడి చేతికి ఇటీవల గాయమైంది. అయితే ఏ కారణం చేత ఆమెకు గాయమైందో తెలియదు. కానీ చేతి కట్టుతోనే ఆమె క్యాట్‌వాక్‌లో పాల్గొన్నది. ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కనిపించింది. కియారా అద్వానీ, సోభితా దూళిపాళ, ఆదితి రావు హైదరీతో పాటు ఇతర బాలీవుడ్ నటీనటులు కేన్స్‌లో దర్శనమిచ్చారు. 77వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య క్యాట్‌వాక్‌లో పాల్గొనడం ఇది 21వసారి. ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్‌తో ఆకట్టుకోగా.. తాజాగా మరో నటి ఊర్వశి రౌతేలా సైతం సందడి చేసింది. కస్టమ్ మేడ్ గౌనులో హళయలు పోతూ అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఊర్వశి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొనింది. కియారా అద్వానీ, సోభితా దూళిపాళ, ఆదితి రావు హైదరీతో పాటు ఇతర బాలీవుడ్ నటీనటులు కేన్స్‌లో దర్శనమివ్వనున్నారు.