17-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాలా అరుదుగా సోషల్ విూడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దీంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ’డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న ’కల్కి’ సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ పోస్ట్ పెట్టినట్లు సమాచారం. తనకు కమల్ హాసన్ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్ ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు. ఆయన ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడిరచినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్ పెట్టారు.. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం.
కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా‘ అని అన్నారు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. మరికొందరు మాత్రం ఆయన పెళ్లి గురించి పెట్టారని చర్చించు కుంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరే ’కల్కి 2898 ఏడీ. ఇందులో కమల్‌హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.