17-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ యువ నటులు సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ’లగ్గం’. పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కెతున్న ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తుండగా.. నటకిరిటి రాజేందప్రసాద్ చాలా రోజుల తర్వాత కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రాజేందప్రసాద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. పెళ్లి తాలూకు ఆటపాటలు, మర్యాదలు, భావోద్వేగాలతో సాగుతుంది. తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా అలరిస్తుంది’ అన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్ చెప్పాల.