17-05-2024 RJ
సినీ స్క్రీన్
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి చాలా నెలలు అవుతోంది. అప్పటి నుంచి దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ మూవీ టీమ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ విూడియాలో షేర్ అవుతోంది. ’ఎన్టీఆర్ 31’ వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ’డ్రాగన్’ పేరు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్‌లో దర్శనమిస్తున్నాయి. అక్టోబర్‌లో ఈ భారీ బ్జడెట్ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ’సలార్2’ పనుల్లో మునిగిపోయారు. ఎన్టీఆర్ ’దేవర’ షూటింగ్‌లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా ఇది. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ మూవీతోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ’వార్2’లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈసినిమాతో ఆయన బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.