17-05-2024 RJ
తెలంగాణ
వరంగల్, మే 17: గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నర్సింహారెడ్డికి మెమోరండం ఇవ్వడం జరిగింది. సందర్భంగా అజ్మీర వెంకట్ మాట్లాడుతూ హనుమకొండ జనగామ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమ కళ గత మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పటినుండి గిరిజన సంక్షేమ శాఖను భ్రష్టు పట్టించిందన్నారు. అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర నుండి మధ్యవర్తి ఒక వార్డెన్ ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
జనగామ హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క వార్డులకు రెండు మూడు హాస్టల్లో ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ వారి దగ్గర నుండి హాస్టల్ లో ప్రతినెల డైట్ బిల్స్ లో 20శాతం తీసుకొని పిల్లల హాజరు శాతం 100 వేసుకోండి అని వార్డెన్లకు చెపుతూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు ఆరోపించారు. అలాంటి ప్రేమకళ పై ఏసీబీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది వార్డెన్లను ప్రిన్సిపాల్ లను హనుమకొండ లో ఉన్న డి టి డి ఓ ఆఫీస్ లో ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు.
అన్ని అంశాలపై సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రేమకళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. లేని పక్షంలో ఎన్ హెచ్ పి హెచ్ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు ఆందోళనలు చేపడతామని హెచ్చరిక చేసారు.