ad1
ad1
Card image cap
Tags  

  17-05-2024       RJ

కోహెడ మార్కెట్‌ అభివృద్ది ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ

  • అంతర్జాతీయ స్థాయికి కోహెడ మార్కెట్‌ అభివృద్ది
  • ఖమ్మం మార్కెట్‌ అభివృద్దికి ప్రణాళికలు
  • మార్కెట్‌ యార్డులపై సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు
  • జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యం
  • టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్‌ల తయారీకి చర్యలు

హైదరాబాద్‌, మే 17: తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్‌ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనిని అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌గా అభివృద్ది చేస్తామని అన్నారు. అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. అన్ని మౌళిక సదుపాయాలతో కొహెడ మార్కెట్‌ యార్డుని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డును కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.

తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో ’శానిటరీ నాప్‌కిన్‌’ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అలాగే, బుగ్గపాడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులో వచ్చే నెలలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌ కిన్‌ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సచివాలయంలో తుమ్మల నాగేశ్వరరావు తన శాఖలపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, టీ.ఎస్‌.ఐ.ఐ.సి ఎండీ విష్ణువర్ధన్‌ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, హార్టికల్చర్‌ సంచాలకులు అశోక్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయితో సవిూక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అకాల వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌ , గిడ్డంగుల సంస్థ గోదాములపైన సోలార్‌ ప్యానెల్స్‌ ను ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.  కొహెడ పండ్ల మార్కెట్‌ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌళికసదుపాయాల తో అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. బుగ్గపాడు మెగా టెక్స్‌ టైల్‌ పార్కులో వచ్చేనెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కొహెడ పండ్ల మార్కెట్‌ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొహెడ మార్కెట్‌ యార్డుని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్‌ అభివృద్ధికి సబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ  అధికారులను ఆదేశించారు. అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డును సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు మంత్రి నాగేశ్వర రావు జారీ చేశారు.  దానితో పాటుగా రాష్ట్రంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP