17-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 17: తెలంగాణ వ్యాప్తంగా పీజీఈసెట్ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన టీఎస్ పీజీఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ అరుణ కుమారి తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్‌ని సందర్శించాలని తెలిపింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేయడానికి ప్రభుత్వం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ పీజీఈ సెట్. అభ్యర్థులు బీఈ, బీటెక్, బీఆర్క్, బీఎª`లానింగ్, బీఫార్మసీ, బీఎస్సీ ఉత్తీర్ణులై వారు అర్హులు.