ad1
ad1
Card image cap
Tags  

  18-05-2024       RJ

టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. 90.18శాతం బాలికల ఉత్తీర్ణత

తెలంగాణ

  • అగ్రికల్చర్‌, ఫార్మసీలో 88.25శాతం బాలురు
  • ఇంజినీరింగ్‌లో 74.38శాతం బాలురు
    75.85శాతం బాలికల ఉత్తీర్ణత
  • ర్యాంకులను ఎగురేసుకు పోయిన ఎపి విద్యార్థులు

హైదరాబాద్‌, మే 18: టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్‌ పరీక్ష లు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంకు కార్డులను టీఎస్‌ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగిన ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్టాల్ర నుంచి సుమారు 3.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 88.25శాతం బాలురు, 90.18శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో 74 38శాతం బాలురు, 75.85శాతం బాలికలు ఉత్తిర్ణత సాధించారు. రెండు విభాగాల్లోనూ బాలురే టాప్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇదే మొదటి ఈఏపీసెట్‌. కాగా, ఈ పరీక్షకు అగ్రికల్చర్‌, ఫార్మ విబాగాలకు 91,633 మంది విద్యార్థులు హాజరవగా.. వీరి శాతం 91.24 శాతం ఉంది.

ఇంజనీరింగ్‌ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా మొత్తం ఈఎపీసెట్‌ కి 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారు.టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో తొలి 9 ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. ఇందులో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు. టాప్‌ 10 ర్యాంక్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచింది. ఇంజనీరింగ్‌ విభాగంలో ఫస్ట్‌ ర్యాంక్‌ సతివాడ జ్యోతిరాదిత్య శ్రీకాకుళం, రెండవ ర్యాంక్‌ గొల్ల లేఖ హర్ష కర్నూల్‌, మూడవ ర్యాంక్‌ రిషి శేఖర్‌ శుక్ల సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచింది. ధనుకొండ శ్రీనిధి ` విజయనగరం,10వ ర్యాంక్‌ సాధించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వెల్లడి సందర్భంగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. గతేడాది వరకు ఎంసెట్‌ పేరు విూద పరీక్షలు నిర్వహించామని, ఈసారి ఎంసెట్‌ పేరును మార్చి ఎప్‌సెట్‌ను మొదటి సారిగా నిర్వహించామని తెలిపారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు 1,00,432 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 91,633 మంది 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ విభాగానికి 2,54750 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,40,618 మంది 94.45 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ఈఎపీసెట్‌ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి పరీక్షలకు రిజిస్టేష్రన్‌ చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఒక్కో షిప్ట్‌ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఈసారి ఒక్కో షిప్ట్‌లో 50వేల మంది పరీక్ష రాసినట్లు ఆయన వెల్లడిరచారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన  చెందవద్దని సూచించారు. త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూలును విడుదల చేస్తానమని లింబాద్రి తెలిపారు. ఇంజినీరింగ్‌, అగ్రి రెండు స్ట్రీమ్‌లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఎంసెట్‌ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP