18-05-2024 RJ
తెలంగాణ
యాదాద్రి, మే 18: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. శనివారం భువనగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయనీగా తమ పార్టీ ఎదుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.