18-05-2024 RJ
సినీ స్క్రీన్
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడిరది చిత్ర బృందం. ఇందులో భాగంగా సూర్యకు జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. తొలి షెడ్యూల్ దాదాపు 40రోజులకు పైగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో మలయాళ నటుడు జోజు జార్జ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.