20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 20: రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మట్టిలో పోషకాలను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయా అధికారులు సూచిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూమికి తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. అన్నదాతలు ఈ విషయాన్ని గుర్తించి రసాయన ఎరువులకు బదులు సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేయాలన్నారు. రైతన్నలు మట్టిని కాపాడితే సమాజాన్ని కాపాడినవారు అవుతారన్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడకం వల్ల భూసారం కోల్పోయి పంట నాణ్యత హీనంగా వస్తుందన్నారు. తద్వారా ఆ పంటను స్వీకరించిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు,. వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు చేయించుకుని రైతులు తమ పోలాల్లొ ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చన్నారు.
అవసరమైనంత మేరకు నత్రజని పోటాష్‌లు, వినియోగించాలన్నారు అంతేకాకుండా భూమి యొక్క బౌతిక రసాయన స్థితిని బట్టి ఆభూమిలో ఏయే పంటలు పండుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుకలుగుతుందన్నారు. అధిక మొత్తంలొ రసాయనాలు వాడి భూమిలోని పోషకాలు తగ్గించకుండా భూమిని జాగ్రత్తగా కాపాడు కోవాల్సిన అవసరం రైతులపై ఉందన్నారు. భూసారం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే తెలుసుకుని వాటిని అవలంబించాలన్నారు. భూమి ఆరోగ్యంగా ఉంటేనే నాణ్యమైన పంటు పండే అవకాశం ఉందన్నారు. పంటకు కావాల్సిన పోషకాలను భూమి ఇస్తుందని భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్మికంపోస్ట్ సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. ఇదిలావుంటే మండల స్థాయిలో, గ్రావిూణ స్థాయిలో కూడా ప్రైవేట్ వ్యక్తులు మట్టి తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వాడేందుకు ప్రభుత్వం రాయితీపై వర్మీకంపోస్టు యూనిట్లను మంజూరు చేస్తోంది. ప్రధానంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయల పంటలలో రసాయనాల వాడకం తగ్గించడం ద్వారా ప్రజలకు మేలైన కూరగాయలు అందేలా చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఉద్యాన పంటలు సాగులో కంపోస్టు ఎరువుల వాడకాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన రైతులకు రాయితీపై వర్మికంపోస్టు యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఉద్యానశాఖ అధికారి తెలిపారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.