20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, మే 20: జగన్‌కి తండ్రి వైఎస్ రాష్ట్రాన్ని దోచుకోవడం మాత్రమే నేర్పారని, నాయ్యకత్వ లక్షణాలు బోధించలేదని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసి దోచుకున్నారని అందుకే 14 నెలలు జగన్‌ని జైల్లో పెట్టారన్నారు. అవినీతిపరులే నేడు నీతులు బోధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి రంగంతో సహా అనేక రంగాల్లో అభివృశృద్ది తిరోమనంలో సాగుతోందన్నారు. హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తరవాత చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతూ ఎపిని ముందుకు తీసుకుని పోగా, దానిని వెనక్కి నెట్టే యత్నాల్లో జగన్ ఉన్నారని అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న దశలో జగన్‌కి ఏమైనా అభిమానం ఉంటే తగిన విధంగా మరింతగా ముందుకు వెళ్లేలా చేసేవారని అన్నారు. కానీ ఎపిని మరింత దోచుకుని రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించబోతోందని అన్నారు. జగన్ అవినీతితో ప్రజలు విసుగు చెంది కూటమికి ఓటేశారని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చామన్నారు. వాటిని విస్మరించి జగన్ పోలవరం సహా అన్నింటిని వెనక్కి మళ్లేంచే యత్నాలతో ఏపీని అధోగతి పాలు చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింని అయ్యన్న మండిపడ్డారు. ఎన్నికల్లో హింసద్వారా లబ్ది పొందాలని చూసిందన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16,611కోట్ల భారం మోపారని తెలిపారు. ఏం అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. బూటకపు హవిూలతో అధికారం చేపట్టారని, తర్వాత వాటిని గాలికి వదలి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు.