20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కడప, మే 20: రాయలసీమ వాసుల ఉద్యమ ఫలితంగానే పోలవరం ప్రాజెక్టు వచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అన్నారు. అందువల్ల రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి నీటి వాటా పొందే వరకు నిరంతర పోరాటాన్ని చేయాలన్నారు. రాయలసీమకు సాగునీటిపై చట్టబద్ధ హక్కు కల్పించాలని, సీమ ప్రాజెక్టులను నిర్మించాలని ఉద్యమాన్ని తీవ్రతరం చేసినప్పుడు ఏవో ఒక ప్రాజెక్టును ప్రారంభించడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పోలవరంపై ముందు శ్రద్ద పెట్టాలని అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కూడా అలాంటిదేనన్నారు. ఈ పథకం ద్వారా రాయలసీమ శాశ్వతంగా సస్యశ్యామలం అవుతుందని పేర్కొనడం అవాస్తమన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన ఉద్యమ ప్రభావాన్ని నీరుగార్చేందుకే జగన్ ప్రభుత్వం తాత్కాలిక పథకాలను హడావుడిగా ప్రారంభించింని విమర్శించారు. తెలుగు గంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుందూ, ఆయకట్టు పరిరక్షణకు హావిూ దక్కాల్సి ఉందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాలోని 1.18 లక్షల ఎకరాలు, జిల్లాలోని 80 వేల ఎకరాలు, హెచ్చెల్సీ కింద 2.95 లక్షల ఎకరాలకు, కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలకు నీరందుతుందా అని ప్రశ్నించారు. గోదావరికి, కృష్ణా జలాలను మళ్లించే దుమ్ముగూడెం ప్రాజెక్టు గురించి ఎవరూ ప్రశ్నించడం లేదని విమర్శించారు.