20-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 20: హైదరాబాద్ శంకర్ మఠ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫష్ ఇండియా బ్రాంచ్‌ను కొత్త ప్రాంగణంలోకి మార్చారు. ఓయూ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కొత్త ప్రాంగణంలోకి మార్చగా, దీనిని ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ సోమవారం ప్రారంభించారు. ఆధునీకరించిన బ్రాంచ్‌లో లాకర్ రూమ్, ఎటిఎంలను కూడా యాన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జన్నార్ మాట్లాడుతూ బ్యంక్‌లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాంక్ గత కొన్నేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండడం హర్షణీయమన్నారు. ఖాతాదారుల సేవలో యూబిఐ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్నీతా సింగ్, బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కరె భాస్కర్ రావు,రీజినల్ హెడ్ బి, భాస్కర్, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.