20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, మే 20: తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా పంపుతున్నారు.