20-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 20: రైతులకు వచ్చే సీజన్ నుంచి రూ.500 పంట బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగిలో రైతుల పండిరచిన ధాన్యం సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజులలోపే గతంలో రైతులకు ఎన్నడూ లేనట్లుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ ఎప్పుడూ ధాన్యాన్ని ఇలా సేకరించలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధాన్యం వేగంగా సేకరించడంతో పాటు 3 రోజుల్లోపే నగదు జమ చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్‌బాబు విూడియాకు వెల్లడిరచారు.అకాల వర్షాలతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ధాన్యం తడిచిపోయింది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ధాన్యం తడిచిన రైతులు ఆందోళన చెందవద్దని, కనీస మద్ధతు ధరకే కొంటామని భరోసా ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. రాష్ట్ర రైతులకు సీజన్ ప్రారంభం కాబోతోంది, పండిరచిన ధాన్యం సమస్య ఉంది, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఓ నివేదిక ఇచ్చింది. దానిపై చర్చించేందుకు కేబినెట్ భేటీ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, రేషన్ బియ్యం, ఇతర పథకాలు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పినట్లు చేస్తామన్నారు. సన్న వడ్లు పండిరచిన రైతులకు వచ్చే సీజన్ నుంచి రూ.500 పంట బోనస్ ఇస్తామని ప్రకటించారు. విత్తనాలు, ఎరువులు, రైతులకు సంబంధించి ఇతరత్రా అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం. అధికారిక కంపెనీల ద్వారా విత్తనాలు కొనుగోలు చేయాలని, రిసీప్ట్ ను పంట వచ్చే వరకు భద్రపరుచుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.600 కోట్లు వెచ్చించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. స్కూళ్లను మోడ్రన్ పాఠశాలలుగా చేసి చూపించడం ఇందిరమ్మ పాలన అన్నారు.
దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి శ్రీధర్ బాబును అధ్యక్షుడిగా నియమించామని చెప్పారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారం.. మేడిగడ్డ పగుళ్లు, అన్నారం లీకేజీ, మూడో డ్యామ్ ప్రమాదం ఉందని కనుక.. చుక్క నీరు ఆపోద్దని గేట్లు తెరవాలని రిపోర్టులో ఉందన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయించామని అన్నారు. ఎంఎస్‌పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్టాన్రికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తాం అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.మంత్రివర్గంలో మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ‘మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే.. సరి అవుతుందన్న గ్యారెంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ చెప్పింది.
అందుకే, తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నాం‘ అన్నారు. బ్యారేజ్‌ల సేప్టీపై ఎక్స్‌పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయించి రిపోర్ట్ తీసుకుంటామన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరమ్మతులు చేపడుతామన్నారు. తక్కువ ఖర్చుతో నీటిని లిప్ట్ చేసేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పబ్లిక్ విూటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు సోనియా గాంధీతో పాటు తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఆహ్వానిస్తామన్నారు. వేడుకల నిర్వహణకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించామన్నారు.