20-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 20: పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ విూనాను కలిసి ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిగ్గు తేల్చాలన్నారు.
అవసరమైతే తన కాల్ డేటాను పరిశీలించాలని.. విచారణకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు కొత్త కుట్రలు చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నేత మన్విత్ కృష్ణారెడ్డి తెదేపా నేత గెటప్‌తో సోషల్ విూడియాలో తెదేపాపై దుష్పచ్రారం చేస్తున్నారని డీఐజీ సెంథిల్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మన్విత్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.