20-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 20: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన నర్సయ్య, ఆయన భార్య రాధ ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మావల పోలీసు స్టేషన్ పరిధిలోని హరితవనం ఎదుట 44వ నంబరు జాతీయ రహదారిపై వీరిద్దరూ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముందు చక్రం రాడ్ విరిగిపోయింది. దీంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి రిమ్స్‌కు తరలించారు.