20-05-2024 RJ
సినీ స్క్రీన్
బెంగళూరు సవిూపంలో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె వెంటనే ఓ వీడియో వదిలి నేనక్కడ లేను.. హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ బుకాయించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే హేమ అక్కడే ఉందని కన్నడ మీడియా కోడై కూస్తోంది. కన్నడ విూడియాకు హేమ ఫొటో లభించిందని, అదే డ్రెస్‌లో హేమ విడుదల చేసిన వీడియో ఉందని సమాచారం.
సోమవారం ఉదయం ఆమె ఓ వీడియో విడుదల చేసి, తాను హైదరాబాదులోనే ఉన్నానంటూ బెంగుళూరు రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని బుకాయిస్తూ ఓ వీడియోలో పేర్కొంది. కానీ సదరు వీడియో సైతం బెంగుళూరు ఫామ్‌హౌస్‌లోనే ఓ పక్కకి వెళ్లి హేమ రికార్డ్ చేసినట్లు సమాచారం. హేమతోపాటు ఆమె స్నేహితుడు చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది.
ఈ రేవ్‌పార్టీలో దాదాపు 100 మంది సభ్యులు ఉన్నారని, అందులో అబ్బాయిలు 70, అమ్మాయిలు 30 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి రక్త నమూనాలను, హెయిర్ శాంపిల్స్ సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. అక్కడ ఏం జరిగింది? ఎవరెవరు ఉన్నారన్నది పోలీసులు వెల్లడిరచే అవకాశం ఉంది.