20-05-2024 RJ
సినీ స్క్రీన్
ప్రస్తుతం రష్మిక మందన్నా క్రేజ్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. మిగతా హీరోయిన్స్ ఆమె దరిదాపుల్లో కూడా లేరు. ఒకటి కాదు రెండు కాదు.. ఆమె చేతిలో ప్రస్తుతం తొమ్మిది క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. రష్మిక చేస్తున్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో పుష్ప ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ధనుష్ ప్రధాన ప్రాత్రలో వస్తున్న కుబేర సినిమాలో నటిస్తోంది.
తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా కీ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కూడా మరో సినిమా చేస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయింది. చిలసౌ ఫేమ్ దర్శకుడు రాహుల్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది రష్మిక. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మికను ఫిక్స్ చేశారని సమాచారం.
ఇక తమిళ్ విషయానికి వస్తే అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తోంది రష్మిక.. అక్కడ ముందుగా సూర్య హీరోగా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక శివ కార్తికేయన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చేస్తున్న సినిమాలో కూడా రశ్మికనే హీరోయిన్. ఇక హిందీలో కూడా రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే ఆమె హిందీలో చవా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది రష్మిక.
సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సికిందర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారికంగా మొదలైన ఈ సినిమాలో రశ్మికను ్గªనైల్ చేశారట టీమ్. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. మిగతా హీరోయిన్స్ టచ్ చేయలేని రేంజ్ లో ఉంది రష్మిక.