21-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, మే 21: అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్ ఎస్‌బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.