21-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 21: కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అట్టహాసంగా వారికి నియామక పత్రాలు ఇచ్చినా జీతాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. పెండిరగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల నియామక ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని విమర్శించారు.
ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండిరగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణమే చెల్లించాలన్నారు.