21-05-2024 RJ
తెలంగాణ
రాజన్న సిరిసిల్ల, మే 21: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హావిూ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు విూదపడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కోనారావుపేట మండటం వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. ప్రమాదంలో మార్పాక రాజవ్వ (45) మృతి చెందగా కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ్వ, వద్నాల అమృత, సందు చంద్రయ్య గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.