21-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 21: బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడిరది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలోభార్య సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు.