21-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 21: తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్తాన్ కోడ్ ?92తో వాట్సప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు.