21-05-2024 RJ
తెలంగాణ
బెంగళూరు/హైదరాబాద్, మే 21: రేవ్ పార్టీ టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఆమె సోమవారం విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేశారని.. దాదాపు వంద మంది పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని కమిషనర్ వెల్లడిరచారు. ’సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర స్పందించారు.
’రేవ్‌పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నాం. రాష్టాన్న్రి డ్రగ్స్‌ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు ఇతర రాష్టాల్ర డ్రగ్స్ పెడ్లర్ల వల్ల విఫలమవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తాం’ అని తెలిపారు. బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో తాను లేనని తెలుపుతూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తనపై వస్తోన్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే రేవ్ పార్టీలో పోలీసులు సంపాదించిన ఫోటోలోని డ్రెస్, వీడియోలని డ్రెస్ ఒకటే కావడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇదిలా ఉంటే బెంగళూరు శివారులో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్‌లో ప్రకంపనలు రేపుతోంది.
నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రేవ్ పార్టీలు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిఘా ఉంచారు. ఫాంహౌస్‌ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో సినీ పరిశ్రమ సహా వివిధ రంగాల ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ పార్టీ వెనుక లింకుల్ని ఛేదించగా గోవా జైలులో ఉండే డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు బయటకొచ్చాయి. అంతకు ముందు టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో రాజకీయ, సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వరుస పరిణామాల దృష్ట్యా రేవ్ పార్టీని హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో నిర్వహించినట్లు నగర పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షల వ్యయంతో ఈ పార్టీ నిర్వహించిన వాసు నేపథ్యం, అతడి సంబంధాలపై దృష్టి సారించారు.