21-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 21: సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. అధికారులు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అతిగా చేస్తే తరవారి పరిణామాలకు బాధ్యులు కాగలరని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలి. వైకాపా నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణం. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బొండా ఉమ డిమాండ్ చేశారు.