ad1
ad1
Card image cap
Tags  

  21-05-2024       RJ

ధాన్యం కొనుగోళ్లపై దుష్పచ్రారం.. మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి

తెలంగాణ

  • వరివేస్తే ఉరి అన్నవారా.. విమర్శించేది
  • చివరి గింజవరకు కొంటూనే ఉంటాం
  • తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా సేకరిస్తాం
  • సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో మొదలు పెట్టాం
  • అబద్దాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తే ఊరుకోం

హైదరాబాద్‌, మే 21: ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం మానుకోవాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కావాలని దుష్పచ్రారాలు చేయడం, అబద్దాలు చెప్పడం అలవాటుగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని ఈ సందర్భంగా భట్టి వెల్లడిరచారు. గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతులను పట్టించుకోలేదని, ప్రచారార్భాటాలు మాత్రం దండిగా చేసిందని విమర్శించారు. వరివేస్తే ఉరి అన్నవారా విమర్శలు చేసేదని మండిపడ్డారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో మొదలు పెడతామని చెప్పారు. రైతుల పేరు విూద రాజకీయాలు చేయొద్దని ఆ రెండు పార్టీల నేతలకు ఆయన సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని ఆగ్రహించారు. గత సర్కార్‌ తడిసిన వడ్లను కొనలేదని విమర్శించారు.

తాము తడిసిన ధాన్యాన్ని MRP రేటుకే కొంటున్నామని తెలిపారు. 15 రోజుల ముందు నుంచి వడ్లు కొనుగోలు పక్రియ ప్రారంభించామని చెప్పారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విూడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం బీఆర్‌ఎస్‌ బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడొద్దని సూచించారు. గత బిఆర్‌ఎస్‌ మోసం చేసిన మాదిరిగా కాకుండా...వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు చేయడం అలవాటు కనుక ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్పచ్రారం చేస్తున్నారని తెలిపారు. అబద్దాలు చెప్పడం భారాస నేతలకు అలవాటన్నారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నట్లు వివరించారు. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని అప్పటి ప్రభుత్వం కొనలేదని గుర్తు చేశారు. ‘చివరి గింజ వరకూ కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దని భట్టి భరోసా ఇచ్చారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ఇచ్చి తీసుకుంటాం.

ధాన్యం రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నాం. వర్షసూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలి. రూ.500 బోనస్‌ సన్న ధాన్యానికే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రూ.500 బోనస్‌ అనేది సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం‘ అని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం తడిసినా, చివరకు మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడిరచారు. రేటు తగ్గించకుండా కొంటామని అన్నారు. దీంతోపాటు వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.

రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కల్లాళ్లలోనే ధాన్యం తడిసి ముద్దవుతుందని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అందులో నిజం లేదని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో తాను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారని భట్టి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం కంటే 15 రోజులు ముందుగానే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా కాకుండా విూకంటే ఎక్కువ కేంద్రాల్లో 7,245 కొనుగోళ్లను ప్రారంభినట్లు స్పష్టం చేశారు. ఎన్ని టన్నుల ధాన్యం పండినా కూడా కొంటామని స్పష్టం చేశారు. ఇక ధాన్యం బోనస్‌ విషయానికి వస్తే సన్న బియ్యానికే రూ. 500 బోనస్‌ అనలేదని, సన్నాలతో 500 రూపాయల బోనస్‌ పక్రియను మొదలు పెట్టామని చెప్పారు.

నాటి సీఎం కేసీఆర్‌ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని భట్టి అన్నారు. రైతుల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పెరగడంతో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని వెల్లడిరచారు. ఈ సందర్భంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లవద్దని కోరారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP