21-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 21: దేశంలో ఫోన్ రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. 2023 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు 30049 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఫోన్ పోయినా.. దొంగతనానికి గురయినా ఆశలు వదిలేసు కోవాల్సింది. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోరు. కానీ తెలంగాణ పోలీసులు నెమ్మది ఆ పరిస్థితి మారుస్తున్నారు. ఫిర్యాదులు తీసుకోవడమే కాదు..రికవరీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చోరీకి గురైన, మిస్సైయిన సెల్ ఫోన్ రికవరీలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
ఏడాదిలో 30 వేల ఫోన్లు రికవరీ చేసి కర్ణాటక తర్వాతి స్థానంలో నిలిచింది. పోర్టల్‌తో పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4869, సైబరాబాద్ పరిధిలో 3078, రాచకొండ పరిధిలో 3042 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. సెల్ ఫోన్ చోరికి గురైనప్పుడు లేదా కనిపించకుండా పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే ఫోన్ల ట్రాకింగ్ సులభం అవుతుందని మహేశ్ భగవత్ వివరించారు.
గతంలోలా ఫోన్లు చోరీ చేస్తే.. ట్రాక్ చేయడానికి కూడా రాకండా దొంగలు ప్రత్యేక సాప్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. చరవాణి పోయిన వ్యక్తి మొదట తన సిమ్ కార్డును బ్లాక్ చేయించి.. తిరిగి అదే నంబర్‌తో కొత్త సిమ్ కార్డును పొందాలి. చరవాణికి సంబంధించిన ఐఎమ్‌ఈఐ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ను బ్లాక్ చేసే సందర్భంలో సిమ్ కార్డుకు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే ఇన్‌వాయిస్ కాపీని వెబ్ సైట్‌లో నమోదు చేయాలి.
అంతేకాకుండా చిరునామాకు సంబంధించిన గుర్తింపు కార్డుతో పాటు.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలు పేర్కొనాలి. అంతగా అవగాహన లేకపోతే పోలీసులే పీఎస్?లో నమోదు చేస్తారు. ఒకసారి నమోదు చేస్తే తిరిగి దాన్ని మళ్లీ నమోదు చేసే అవకాశం ఉండదు. చరవాణి ఐఎమ్‌ఈఐ నెంబర్లను దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు పంపిస్తారు. ఇక సెల్‌ఫోన్‌ను దేశంలో వినియోగించే అవకాశమే ఉండదు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌ను టీఎస్ పోలీస్ సిటిజన్ పోర్టల్‌కు సైతం అనుసంధానించారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఫిర్యాదుదారుడికి సందేశం వచ్చేలా సీఈఐఆర్ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారు.