21-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 21: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్‌ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లే అగ్ర దేశాల సరసన భారత్ నిలిచిందని కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం ఖరారైందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్‌లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నఎంపీ అభ్యర్ధి రఘురాం రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని తెలిపారుమల్లన్న అధికార పార్టీలో ఉన్న ఆయన గొంతు మూగబోదని చెప్పారు.
శాసన మండలిలో మీ గొంతుకగా మల్లన్నను గెలిపించాలని కోరారు. రేవంత్ పాలనలో అన్ని రంగాలు సంతోషంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బొనస్ అంటే తెలియని వారు సన్న వడ్ల బోనస్‌పై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సంపద కొల్ల గొట్టిన కల్వకుంట్ల కుటుంబమే బ్లాక్ మెయిలర్స్.. అని తాను కాదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం అని తెలిపారు. అత్యధిక పట్టభద్రులు ఖమ్మంలో ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల ఉప ఎన్నిక రావడానికి కారణమైన బీఆర్‌ఎస్‌ను ఓడిరచాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు బనాయించిన మాజీ మంత్రి కేటీఆర్ నీతి కథలు చెబుతున్నారని అన్నారు.
కేసీఅర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఘోస పడ్డారని చెప్పారు. కేసీఅర్ హయాంలో ఉద్యోగులకు జీతాలు రాని దుస్థితి ఉందని, పెన్షనర్లు అవస్థలు పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల కలలు నెరవేరుస్తామని హావిూ ఇచ్చారు. తాను మంచోడు కాదని కేటీఆర్ సోషల్ విూడియా లో విష ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు పట్టభద్రులు బుద్ధి చెప్పాలని తీన్మార్ మల్లన్న అన్నారు.