22-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, మే 22: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్టాల్ర నుంచి ప్రజలు తరలి వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన విశాఖలో విూడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఒక కసి కనిపించిందని.. అందుకే భారీగా పోలింగ్ జరిగిందని.. కూటమికే పాజిటివ్ వేవ్ ఉందని అన్నారు. ఐ ప్యాక్ టీమ్‌తో సీఎం జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని.. నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందే నని గంటా శ్రీనివాసరావు అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హింసకు వైసీపీయే కారణమని అన్నారు. తెనాలి వైసీపీ అభ్యర్థిపై ఓటరు చేయి చేసుకోవడంతో.. పబ్లిక్ పల్స్ ఏమిటో తెలుస్తోందన్నారు. జూన్ 9వ తేదీన జగన్ కాదు... చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.