22-05-2024 RJ
తెలంగాణ
పెద్దపల్లి, మే 22: సింగరేణి మెడికల్ కళాశాల భవనంపై నుంచి పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 13 వ డివిజన్ విఠల్ నగర్‌కు చెందిన రావుల విజయ్ ప్రమాదవశాత్తు మెడికల్ కళాశాల పై నుంచి పడి మృతి చెందాడు. ప్రభుత్వ హాస్పిటల్ కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ బ్లాక్ నిర్మిస్తుండగా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.