22-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అధికారులు స్వామివారిని సింహ వాహనం పై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
కాగా ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హనుమద్వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రోడ్లపైకి తరలి వచ్చారు. కాగా రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరగింది. అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారిని అధికారులు ఊరేగించారు.