22-05-2024 RJ
సినీ స్క్రీన్
గతేడాది వచ్చిన విడుతలై పార్ట్`1 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు తమిళ స్టార్ కమెడియన్ సూరి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూరి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా ఈ మూవీ తర్వాత సూరి వరుస మూవీలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే విడుతలై పార్ట్-2 లో నటిస్తున్న సూరి తాజాగా మరో కొత్త సినిమాను విడుదలకు రెడీ చేశాడు. సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గరుడన్. ఈ సినిమాకు కాకీ స్టటై, కోడి,పట్టాస్ చిత్రాల ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రేవతి శర్మ, శివత నాయర్ , బ్రిగుడ సాగ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. సూరి కూడా ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ అవతర్‌లో కనిపిస్తున్నాడు.ఇక ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీసంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సముద్రఖని, రాజేంద్రన్, మైమ్ గోపి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ చేయనుండగా.. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రానికి వెట్రి మారన్ కథను అందిస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.