ad1
ad1
Card image cap
Tags  

  22-05-2024       RJ

రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి

తెలంగాణ

  • బోనస్‌తో వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం
  • ఇచ్చిన హావిూ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే
  • ధాన్యం సేకరణకు కేంద్రం సిద్దంగా ఉంది

హైదరాబాద్‌, మే 22: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకే బోనస్‌ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని చెప్పారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారని తెలిపారు. హైదరాబాద్‌ లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. వాటిని కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటన్నారు.  ఈ ప్రభుత్వం బోనస్‌ పేరుతో అన్నదాతలను మోసం చేసింది. కేంద్రం అన్ని రకాలుగా వారికి అండగా ఉంది.

రబీ సీజన్‌లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో భారాస, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా, కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. మార్కెట్‌యార్డుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొనేందుకు మరో 2 నెలలు పడుతుంది. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.  బోనస్‌ ఇచ్చి కొనడానికి విూకు బాధ ఏంటని కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రైతులను మరో సారి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని దగా చేసిందన్నారు. కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పారు? వరికి క్వింటాల్‌ కు 500 బోనస్‌ ఇస్తామని చెప్పి యే ఒకటి కూడా అమలు చేసేలా లేదన్నారు.

రైతులను నయవంచన చేసి అధికారం లోకి కాంగ్రెస్‌ వచ్చిందన్నారు. దేవుడి పేరుతో ఓట్లు పెడుతూ ప్రజలకి మాత్రం పంగనామాలు పెడుతుంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ అని సన్నాయి నొక్కులు నొక్కుతుందన్నారు.చెయ్యి గుర్తుకు ఓటు వేసినందుకు రైతులకు చేయి ఇస్తుంది ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంత ధాన్యం పండిన యే రకం అయినా కేంద్రం కొంటుంది? రైతులకు అండగా కేంద్రం ఉంటుంది? డబ్బులు చెల్లిస్తుందన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది .. దుర్మార్గం అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు 22 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఖరీఫ్‌ సీజన్‌ ది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదన్నారు. రబీలో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఒప్పందం చేసుకుంటే 33 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించింది ఈ ప్రభుత్వం అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తిన? కొనుగోలు మాత్రం నామ మాత్రంగా నత్తనడకన నడుస్తుంది? రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కోనుగులు చేసింది 75 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే అన్నారు. సోనియమ్మ రాజ్యం అంటే రైతుల కన్నీళ్లు చూడడమా అని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఎఫ్‌సిఐకి చేరే వరకు అయ్యే ఖర్చు మొత్తం భరుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం విూద ఒక్క పైసా కూడా భారం కూడా పడదు? ఇంకా కమిషన్‌ ఇస్తుంది కేంద్రం? కమిషన్‌ డబ్బులతో నే ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. దొడ్డు రకం వేస్తే అడ్డుకుంటామని సీఎం అంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఎందుకు బోనస్‌ చెల్లించడం లేదో రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ చెప్పాలన్నారు. విూ గారెంటీలు గారడీలు కాకుంటే తెలంగాణ ఓట్ల విూద విూకు గౌరవం ఉంటే ఇచ్చిన హావిూలు అమలు చేయాలన్నారు. ఇప్పుడు కళ్ళాలలో ఉన్న దాన్యం కు బోనస్‌ చెల్లించి కోనాల్సిందే అని డిమాండ్‌ చేశారు.

ధాన్యం విూద కనీస ధర 61 శాతం కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. సన్న బియ్యం కి వెయ్యి బోనస్‌ ఇవ్వాలన్నారు. మిగతా ధాన్యానికి 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఛత్తీస్‌ ఘడ్‌ ప్రభుత్వం వెయ్యి రూపాయల బోనస్‌ ఇస్తుందన్నారు. రుణమాఫి చేయని కారణంగా రైతులు కొత్తగా రుణం తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు రైతులు అప్పులు ఎక్కడ తెచ్చుకోవాలి? రైతు బతుకు ఏంది? అని ప్రశ్నించారు. ఆగస్టు లో రుణమాఫీ చేస్తారనే నమ్మకం లేదన్నారు. ఆగస్టు వరకు వర్షాలు పడకుండా రేవంత్‌ రెడ్డి ఏమైనా ఆపుతారా? అని వ్యంగాస్త్ర వేశారు. 6 గ్యారంటీల పై సోనియమ్మ సంతకంతో ఇంటింటికి లెటర్‌ రాసింది కాంగ్రెస్‌ అన్నారు. భారత దేశాన్ని మోసం చేస్తున్న చరిత్ర కాంగ్రెస్‌ అని తెలిపారు. కాంగ్రెస్‌ ఆలోచన గుంట నక్క కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు.ఎన్ని తరాలు మారినా కాంగ్రెస్‌ తీరు మారదన్నారు.

15 వందల తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీ నీ జూన్‌ 2 న ఆవిర్భావ దినోత్సవం కు పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీ ఎలా వస్తారు? అని మండిపడ్డారు. తెలంగాణను ప్రజలు దంచి తెచ్చుకున్నారు? సోనియా ఇవ్వలేదన్నారు. సోనియా వారసత్వ రాజకీయాలకు నాయకురాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల పోరాటం చేసి సుష్మ స్వరాజ్‌ పోరాటం తో తెలంగాణ వచ్చిందన్నారు. మార్కెట్‌ యార్డు లు విజిట్‌ చేస్తానని కిషన్‌ రెడ్డి అన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP