ad1
ad1
Card image cap
Tags  

  23-05-2024       RJ

జూన్‌ 5 తరవాత భారాసా దుకాణం బంద్‌: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ

  • కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు
  • రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి ఇచ్చారు
  • కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు సమాధానం చెప్పండి
  • కెటిఆర్‌ నోరు అదుపులో పెటుకోకుంటే ఖబర్దార్‌

హైదరాబాద్‌, మే 23: ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారాస నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం దిల్లీకి వెళ్లింది. అవినీతి చేయకుండానే భారాస ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ఇకపోతే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేటీఆర్‌ బచ్చా అని.. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కానీ, రేవంత్‌ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్‌ అయ్యారని పేర్కొన్నారు. రేవంత్‌ వయసులో పోలిస్తే కేటీఆర్‌ చిన్న పిల్లాడు అని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కేకే మహేందర్‌ రెడ్డి పొట్ట కొట్టి కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యాడని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల రిజల్ట్స్‌ తరువాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్‌ఎస్‌ పార్టీ కూలిపోవడం ఖాయం అన్నారు. కేసీఆర్‌ కూతురు కవిత చేసిన పనికి రాష్ట్రం పరువు పోతోందని వ్యాఖ్యానించారు.  5వ తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే కేటీఆర్‌, హరీష్‌ రావునితరిమి కొడుతారని అన్నారు.

నందినగర్‌ నుండి కారులో న్యూట్రల్‌లో వెళ్లినా అసెంబ్లీకి చేరుకోవచ్చునని.. కట్టే పట్టుకొని అసెంబ్లీకి రాలేదు కానీ, బీజేపీ కోసం కెసిఆర్‌ బస్సులో తిరిగారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ కోసం కొట్లాడిరది తామేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు మూడు స్థానాల్లో డిపాజిట్‌ వస్తుందని.. అన్ని స్థానాల్లో ఓడిపోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 12 రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ లేకుండా పోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి లీడర్‌, క్యాడర్‌ లేకుండా పోతారని అన్నారు. 5వ తేది తర్వాత తెలంగాణ భవన్‌కి తాళం వేసుకోవాల్సి వస్తుందన్నారు. కవితకు బెయిల్‌ రావట్లేదని కేటీఆర్‌ పూర్తిగా ఫ్రస్టేషన్‌లోకి వెళ్లారని.. అందుకే ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నందుకు మా రేవంత్‌ని తిడుతున్నావా? 500 రూపాయలకు సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ ఇవ్వడమే మేం చేస్తున్న పాపమా? హాస్టల్స్‌, పేదవారికి ఇచ్చే ఉచిత బియ్యం పూర్తిగా సన్నబియ్యం ఇద్దామనుకోవడం తప్పా? మేం ఇచ్చిన నోటిఫికేషన్‌ కాంగ్రెస్‌ క్లెయిమ్‌ చేసుకుంటుంది అంటున్నావ్‌. మరి విూరే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మా ముందు చూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది. కేసీఆర్‌ చేసిన పనికి మూడు డ్యాములు కొట్టుకొని పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు. వైన్‌ షాపుల పేరు విూద కేసీఆర్‌ నాన్‌ రిఫండబుల్‌ పైసలు గుంజిండు. ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం.

మల్లన్నపై కేసులు ఉన్నాయని అంటున్నావ్‌.. విూ చెల్లిపై 8000 పేజీల ఛార్జ్‌ షీట్‌ పై ఏమంటావ్‌ కేటీఆర్‌? మహేశ్వర్‌ రెడ్డి ఏం పైరవీ చేసుకొని పదవి తెచ్చుకున్నారు? ఆయన పేరు పలకాలంటే సిగ్గుగా ఉంది?’ అని కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. తెలంగాణ బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్‌  అయ్యారు. ఈ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లినా మహేశ్వర్‌ రెడ్డి ఆర్టీఐ అప్లికేషన్లే ఉంటున్నాయని అన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి పైసలు సంపాదించాలని మహేశ్వర్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఆర్టీఐలు కోరుతున్న మహేశ్వర్‌ రెడ్డి.. నిర్మల్‌ నియోజకవర్గానికి ఏం కావాలని ఒక్కసారైనా అడిగారా? అని మంత్రి ప్రశ్నించారు.

ఇకపోతే జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే భారాస కార్యాలయాలు నిర్మించారు. ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయి. ఎల్బీనగర్‌ ఆస్పత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరాం. ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదు. నల్గొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. భారాస ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శలు చేశారు. ఇచ్చిన హావిూలను ప్రాధాన్య క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, వేసవిలో వడగళ్ల వాన కారణంగా పంటనష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడిరచారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP