23-05-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, మే 23: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట భారాస ఎమ్మెల్యే మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యం విక్రయం కోసం నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన.. పూడురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. రైతులంతా హైదరాబాద్‌కు వచ్చి ఉద్యమం చేస్తామంటున్నారని పేర్కొన్నారు. వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే.. వ్యవసాయ మంత్రి కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు బాండ్ పేపర్‌పై రాసిచ్చి.. వడ్లకు బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. ఆరోజు విూరు రాసిచ్చిన బాండ్ పేపర్‌పై సంతకాలు పెట్టారు కదా? విూరు సంతకాలు పెట్టి.. నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి.. చేతుల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమందంటే చేతులెత్తేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో రైతులతో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే జిల్లా పరిధిలో 2.97లక్షల ఎకరాల్లో యాసంగిలో వడ్ల పండితే.. 2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లే ఉన్నయ్. మిగితా 17వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. అవి కూడా ఇంటిమందం సన్నాలు తిండిగింజల కోసం సాగు చేశారు.
దానికి విూరు బోనస్ ఇచ్చేది ఏందీ? లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే మా జగిత్యాలలో జైశ్రీరామ్ అనే సన్నవడ్లకు బయట రూ.2800`రూ.3వేలు కొనుగోలు చేస్తున్నరు. గవర్నమెంట్ ఇచ్చేది ఏందీ? ప్రైవేటులోనే కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల రూ.500 కోసం ప్రభుత్వానికి అమ్మనే అమ్మరు. ఇదంతా మోసం ఉన్నది అని రైతు లక్ష్మారెడ్డి చెబుతూ వాపోతున్నరు. వాస్తవానికి దొడ్డు రకమైతే 25, 30 క్వింటాళ్లు పండుతయ్. సన్న రకాలైతే 10, 15 క్వింటాళ్లు పండుతయ్. దాదాపు పది క్వింటాళ్ల వరకు దిగుబడి తక్కువ. రోగాలు, పెట్టుబడి, నెలరోజుల కాలం ఎక్కువ. మన ప్రాంతంలో రైతులు పండిరచేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకమే ఎక్కువ.
మరి సన్నాలకు బోనస్ ఇస్తామంటే.. రైతులను మోసం చేయడం, దగా చేయడం.. రైతులను గుండెలపై తన్నడం తప్ప ఇంకోటి లేదు’ అన్నారు. ఈ రైతులే చెబుతున్నరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేస్తున్నది. అంటే ఇవాళ రైతులను అవమానపరుస్తున్నారని అంటూ నిలదీశారు. రైతులందరూ ముక్తకంఠంతో చెబుతున్నరు. మేమందరం హైదరాబాద్‌కు వస్తాం. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నరు. దీనిపై స్పందించాలని అన్నారు. మొన్న లోక్‌సభ ఎన్నికల సమయంలో డబ్బాలో ఓటుపడేదాక ఏవిూ మాట్లాడలేదు. ఇప్పుడు సన్నాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
రైతులను మోసం చేస్తున్నరు. మంత్రులు మేల్కొనాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే వనపర్తిలో భారాస నేత శ్రీధర్ హత్య ఘటనను హరీశ్‌రావు ఈ సందర్భంగా ఖండిరచారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు భారాస నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదని స్పష్టం చేశారు. భారాస శ్రేణులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.