23-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 23: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అధికారి బరితెగించాడు.. ఒళ్ళు మరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డు చేసి, వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన బల్దియా పరిధిలోని గాజులరామారంలో వెలుగు చూసింది. సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కిషన్.. తన కింద పని చేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్లు వినాలని ఆమెను బెదిరించాడు.
అంతేకాదు విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. అధికారి వేధింపులు భరించలేక నరకయాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగమంతా తన ఫోన్లో రికార్డు చేసి.. అవి మళ్లీ మళ్లీ చూస్తూ నేత్రానందం పొందాడు. ఈ క్రమంలో కిషన్ లైంగిక వీడియోలు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి.
తోటి కార్మికుల ఫోన్లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ చూసిన కార్మికులు ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కామాంధుడు కిషన్ వారి నోరు మూయించాడు. కూకట్పల్లి మహిళ ఐఏఎస్ అధికారిణి జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం వెలుగు చూసింది. ఆమె పరిధిలో పని చేస్తున్న ఓ మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డురంగా ఉందని మహళా కార్మికులు వాపోతున్నారు.