23-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, మే 23: శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు విూదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు. అలాగే 10గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ నెల 15వ తేదీ సాయంత్రం శాస్తోక్తర్రగా అంకురార్పణ జరిగింది. కాగా విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరుతాయన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్ధించానని స్వరూపానంద స్వామి తెలిపారు.