23-05-2024 RJ
తెలంగాణ
పెద్దపల్లి, మే 23: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్‌ను గురువారం సీడబ్ల్యూపీఆర్‌ఎస్(సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్) బృందం సభ్యులు సందర్శించారు. పుణెళి నుంచి వచ్చిన టీం సభ్యులు స్థానిక ఇంజినీరింగ్ అధికారులతో కలసి బరాజ్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బరాజ్ డౌన్ స్టీమ్‌ను, బరాజ్‌లోని పియర్ 60వ గేటును క్షుణ్ణంగా పరిశీలించారు.
దాదాపు గంట పాటు ప్రాజెక్టులో కలియతిరిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సందర్భంలో స్థానిక ఇంజినీరింగ్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్వతీ బరాజ్ సందర్శనలో బృందం సభ్యులు జేఎన్ ఎడ్లబడ్కర్, డాక్టర్ ప్రకాశ్ కే పాలే, డాక్టర్ డీజీ నాయుడుతో పాటు స్థానిక ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.