23-05-2024 RJ
తెలంగాణ
భూపాలపల్లి, మే 23: సన్న బియ్యానికే మద్దతు ధర ఇస్తారట.. మన తెలంగాణాలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తామని... పండిరచిన రైతుల పరిస్థితి ఎంటని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. వడ్లకు బోనస్ అని చెప్పి బోగస్ చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం భూపాలపల్లిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యుయేట్ ఎన్నిక జరిగినప్పుడల్లా మనమే గెలిచామని, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అన్నీ తుస్సుమన్నాయని, కాంగ్రెస్ ప్రచారంలో 6 గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు.
ఉపాధ్యాయుల విూద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచిందని, మహిళా గ్రాడ్యుయేట్‌లు కూడా బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. మహిళా పథకం కింద వారికి నెలకు రూ. 2,500 ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నిన్న వరంగల్ ఎంజీఎంలో కరెంట్ పోయిందన్నారు. విద్యుత్ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.