23-05-2024 RJ
సినీ స్క్రీన్
దేవర ఫియర్ సాంగ్‌కు 50 మిలియన్లకుపైగా వ్యూస్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రాజెక్ట్ దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా దేవర నుంచి ఇటీవలే ఫియర్ సాంగ్ ను లాంఛ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట నెట్టింట గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటిరకు 50 మిలియన్లకుపైగా వ్యూస్‌తో టాప్ వన్ ప్లేస్‌లో ట్రెండిరగ్ అవుతోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న దేవర గ్లింప్స్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ భామకు దేవర తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్. దేవర పార్టు 1 డిజిటల్ స్టీమ్రింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్ దక్కించుకుంది. కాగా మేకర్స్ చాలా రోజుల క్రితం లాంఛ్ చేసిన దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ స్టన్నింగ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సెగలు పుట్టిస్తోంది.
దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, ్గªన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.