23-05-2024 RJ
సినీ స్క్రీన్
మహానటి సినిమాతో తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తిసురేశ్. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తిసురేశ్ బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న బేబీజాన్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోందని తెలిసిందే. కాగా ఈ మూవీలో కీర్తిసురేశ్ బోల్డ్ లిప్‌లాక్ సీన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఒకటి బీటౌన్‌గా హాట్ టాపిక్‌గా మారింది. బేబీ జాన్‌లో వామికా గబ్బి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్ట్ కాలీస్ డైరెక్ట్ చేస్తుండగా.. జవాన్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నాడు.
షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేబీజాన్ కీర్తిసురేశ్ బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. ఈ భామ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.