ad1
ad1
Card image cap
Tags  

  24-05-2024       RJ

ఆన్‌లైన్‌లో.. యాదాద్రి సేవలు

తెలంగాణ

యాదాద్రి, మే 24: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇలా వైకుంఠంగా పేరుందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది.తిరుమల తరహాలో యాదాద్రి సేవలను, దర్శనాలను ఆన్‌లైన్‌ చేయాలని యోచిస్తున్నారు. ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించే భక్తులకు శుభవార్తగా చెప్పుకోవాలి రోజు రోజుకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం తరవాత గణనీయంగా యాత్రికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనం కోరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసింది ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్‌ లైన్‌ లో నమోదుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం అన్ని సేవలను ఆన్‌ లైన్‌ అందుబాటులోకి దేవస్థానం తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో  వెబ్‌సైట్‌ ను సందర్శించి టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్‌ సైట్‌ నుంచి ఈ హుండీ ద్వారా డొనేషన్స్‌ కూడా ఇవ్వవచ్చు.

ఆన్‌ లైన్‌ బుకింగ్‌ ద్వారా గంట ముందు దర్శన, పూజ కైంకర్యాలకు బుకింగ్‌ చేసుకునే అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం కల్పించింది. ఆన్‌ లైన్‌ బుకింగ్‌ లో పేరు, గోత్రం, పూజ వివరాలు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, తేదీ, ఎన్ని టికెట్లు, అడ్రస్‌, ఆధార్‌ నెంబర్‌, ఆలయ సందర్శన వేళ వంటి వివరాలు నింపాలి. ఆన్‌ లైన్‌ బుకింగ్‌, కౌంటర్‌ లో కంప్యూటరైజ్డ్‌ టికెట్లు పొందిన భక్తులకు తూర్పు రాజగోపురం వద్ద టికెట్లపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఆలయంలో లోనికి అనుమతిస్తారన్నారని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇది మంచి ఆలోచన అని భక్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP