24-05-2024 RJ
తెలంగాణ
భద్రాచలం, మే 24: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారా మెడికల్ కళాశాల వద్ద శుక్రవారం బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక నర్సింగ్ కళాశాల విద్యార్థిని కారుణ్య (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. అలాగే నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం కళాశాలలో కారుణ్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కాలేజీ యాజమాన్యం.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ.. సాయంత్రం మరణించింది. దీంతో ప్రభుత్వాసుపత్రి నుంచి కళాశాల వరకు కారుణ్య మృతదేహంతో ఆమె బంధువులు, కళాశాల విద్యార్థులు ర్యాలీగా చేరుకుని.. ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న చైర్మన్‌పై కారుణ్య బంధువులు దాడికి యత్నించగా.. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.