24-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, మే 24: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్టాల్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి, మూడు కిలోవిూటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. వీరికి 20 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడిరచారు. క్యూలైన్లో నిలబడ్డ భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అల్పహారం, పాలు, తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు వెల్లడిరచారు. కాగా నిన్న స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా 36,128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.