24-05-2024 RJ
సినీ స్క్రీన్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ’గం..గం..గణెశా’ . ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై`లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను అందించారు. ఓవైపు కామెడీతో పాటు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రగతి శ్రీవాస్తవ, ఎన్ సారిక ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండగా.. ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.